Ravindranath Reddy: సీఎం జగన్‌ మేనమామకు నిరసన సెగ

వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, సీఎం జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. కమలాపురం మండలం దేవరాజుపల్లె, ఎస్సీకాలనీ, బాలిరెడ్డిపల్లె గ్రామాల్లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడానికి వైకాపా నాయకులు ఏర్పాట్లు చేశారు.

Updated : 21 Apr 2023 11:49 IST

కమలాపురం, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, సీఎం జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. కమలాపురం మండలం దేవరాజుపల్లె, ఎస్సీకాలనీ, బాలిరెడ్డిపల్లె గ్రామాల్లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడానికి వైకాపా నాయకులు ఏర్పాట్లు చేశారు. ఈ గ్రామాలు తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి స్వగ్రామం మాచిరెడ్డిపల్లెకు సమీపంలో ఉన్నాయి. విషయం తెలుసుకున్న మూడు గ్రామాల్లోని తెదేపా వర్గీయులు తమ ఇళ్లకు తెదేపా జెండాలు కట్టి తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. మరికొందరు పొలాల వద్దకు, కడపకు వెళ్లిపోయారు. ఎస్సీకాలనీలో రెండు, బాలిరెడ్డిపల్లెలో నాలుగైదు, దేవరాజుపల్లెలో కొన్ని ఇళ్లలో మాత్రమే స్థానికులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని