సచిన్‌ పైలట్‌ పాదయాత్ర వ్యక్తిగతం

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అసమ్మతి నాయకుడు సచిన్‌ పైలట్‌ గురువారం ప్రారంభించిన ‘జన్‌ సంఘర్ష్‌ యాత్ర’ పూర్తిగా ఆయన వ్యక్తిగత కార్యక్రమమని, పార్టీతో దీనికి ఎలాంటి.

Published : 12 May 2023 04:47 IST

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ స్పష్టీకరణ

జైపుర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అసమ్మతి నాయకుడు సచిన్‌ పైలట్‌ గురువారం ప్రారంభించిన ‘జన్‌ సంఘర్ష్‌ యాత్ర’ పూర్తిగా ఆయన వ్యక్తిగత కార్యక్రమమని, పార్టీతో దీనికి ఎలాంటి సంబంధం లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌సింగ్‌ డోటాసరా స్పష్టం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పార్టీ గుర్తుతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేతల ఫొటోలతో చేపడితే కాంగ్రెస్‌ యాత్ర అవుతుందన్నారు. కాగా, అజ్‌మేర్‌ నుంచి జైపుర్‌ వరకు 125 కి.మీ.ల మేర అయిదు రోజుల పాదయాత్రను చేపట్టిన సచిన్‌ పైలట్‌ యాత్ర ప్రారంభానికి ముందు బహిరంగ సభలో మాట్లాడారు. ‘ఈ యాత్ర ఎవరికీ వ్యతిరేకం కాదు. అవినీతిని అరికట్టాలంటూ రాష్ట్ర యువత సంక్షేమానికి ఉద్దేశించినది’ అని పేర్కొన్నారు. కాగా, ఈ యాత్ర ప్రారంభమైన రోజే సీఎం గహ్లోత్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించిన ఓ వీడియోను కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. ‘జన్‌ జన్‌ కే ముఖ్యమంత్రి’ అని అందులో పేర్కొంది. జైపుర్‌లో గురువారం ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యంలో కక్షలు సృష్టించేవారు ఎన్నటికీ విజయం సాధించలేరు. అందరినీ కలుపుకొని వెళ్లేవారే విజేతలు అవుతారు’ అని పరోక్షంగా సచిన్‌ పైలట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని