కాంగ్రెస్‌కు మద్దతుపై మమతతో ఏకీభవించిన అఖిలేశ్‌

కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట ఆ పార్టీకే మద్దతిస్తామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

Published : 17 May 2023 04:17 IST

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట ఆ పార్టీకే మద్దతిస్తామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేయాల్సి ఉందని, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడే పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు. బిహార్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు నీతీశ్‌ కుమార్‌, కేసీఆర్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో అఖిలేశ్‌ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట ఆ పార్టీకే మద్దతిస్తామని మమత సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని