BRS: మరాఠా గడ్డపై భారాస బోణీ

మహారాష్ట్రలో భారాస శాఖ శిక్షణ శిబిరం జరుగుతున్న రోజే ఆ పార్టీకి శుభవార్త అందింది. ఔరంగాబాద్‌ సమీప గంగాపూర్‌ తాలూకాలోని అంబేలోహల్‌ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో భారాస మద్దతుదారు వార్డు సభ్యుడిగా విజయం సాధించారు.

Published : 20 May 2023 02:56 IST

పంచాయతీ ఉప ఎన్నికలో పార్టీ మద్దతుదారు విజయం

ఈనాడు, నిజామాబాద్‌: మహారాష్ట్రలో భారాస శాఖ శిక్షణ శిబిరం జరుగుతున్న రోజే ఆ పార్టీకి శుభవార్త అందింది. ఔరంగాబాద్‌ సమీప గంగాపూర్‌ తాలూకాలోని అంబేలోహల్‌ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో భారాస మద్దతుదారు వార్డు సభ్యుడిగా విజయం సాధించారు. ఈ గ్రామం గత నెల 24న భారాస బహిరంగ సభ జరిగిన శంభాజీనగర్‌కు సమీపంలో ఉంటుంది. గురువారం ఉప ఎన్నిక జరగ్గా.. శుక్రవారం ఫలితం వెలువడింది. భారాస బలపర్చిన అభ్యర్థి గఫూర్‌ సర్దార్‌ పఠాన్‌ 115 ఓట్ల ఆధిక్యంతో తన ప్రత్యర్థిపై గెలుపొందారు. ఆయన ఇటీవలే భారాసలో చేరారు. ఈ సమాచారాన్ని పార్టీ వర్గాలు ‘ఈనాడు’కు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని