నోట్ల మార్పిడికి అవకాశం కల్పించడం కుంభకోణమే

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు నష్టం కలగజేస్తూ కార్పొరేట్‌ కంపెనీలు, ధనవంతుల ప్రయోజనాలను కాపాడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Published : 20 May 2023 04:09 IST

సీపీఐ నేత నారాయణ

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు నష్టం కలగజేస్తూ కార్పొరేట్‌ కంపెనీలు, ధనవంతుల ప్రయోజనాలను కాపాడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.రెండు వేల నోటుపై ఆర్‌బీఐ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. నోటును పూర్తిగా నిషేధించకుండా మార్చుకోవడానికి అవకాశం కల్పించడంలో కుంభకోణం ఉందని ఆరోపించారు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నల్లధనం ఉన్నవాళ్లు వైట్‌మనీగా మార్చుకున్నారని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని