ఎసైన్డ్ భూముల్లో ప్రభుత్వ రియల్ దందా
రాష్ట్ర ప్రభుత్వం ఎసైన్డ్ భూముల్లో రియల్ దందాకు పాల్పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దళితులకు న్యాయబద్ధంగా వచ్చిన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
విరమించుకోకుంటే భాజపా ఆధ్వర్యంలో ఆందోళన
సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎసైన్డ్ భూముల్లో రియల్ దందాకు పాల్పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దళితులకు న్యాయబద్ధంగా వచ్చిన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనుల భూముల్లో ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారాలను ఆపాలని.. వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలన్నారు. ప్రభుత్వం ఈ ప్రయత్నాలను విరమించుకోకుంటే భాజపా పెద్దఎత్తున ఆందోళన చేపడుతుందని పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం బండి సంజయ్ లేఖ రాశారు. ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇప్పటికే చదువుకు దూరమవుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు దళితులు, గిరిజనులను మభ్యపెట్టి, భయపెట్టి వారి భూములు లాక్కొని రియల్ వ్యాపారానికి పూనుకోవడం సరికాదన్నారు. సిద్దిపేటలో ప్రభుత్వం ప్రారంభించిన వెంచర్ దళితుల భూముల్లోనే ఉందని, శంషాబాద్‌లో గిరిజన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దళితుల సంక్షేమమంటే ఎత్తైన విగ్రహాలు, పాలనా భవంతులకు పేర్లు పెట్టడం కాదని.. వారికి జీవనోపాధి కల్పించడమే ముఖ్యమని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sanjay Raut: నన్ను, నా సోదరుడినీ చంపేస్తామని బెదిరింపులు.. సంజయ్ రౌత్
-
Sports News
WTC Final: తొలుత రహానె.. మరోసారి శార్దూల్.. సేమ్ బౌలర్
-
Crime News
Shamshabad: బండరాయితో కొట్టి.. కారు కవర్లో చుట్టి.. అప్సర హత్య కేసులో కీలక వివరాలు
-
General News
Palnadu: పోస్టుమార్టానికీ లంచం !.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
-
Movies News
Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. సాయం చేస్తామన్న ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి
-
General News
TS High court: ప్రశ్నప్రతాల లీకేజీ కేసు.. సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరమేంటి?: హైకోర్టు