Ambati Rambabu: పవన్.. కూలీ నంబర్‌వన్.. ఆయన రాజకీయాలకు పనికిరాడు: మంత్రి అంబటి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కూలీ నంబర్ వన్ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
సత్తెనపల్లి, న్యూస్‌టుడే: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కూలీ నంబర్ వన్ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు అనర్హుడన్నారు. చంద్రబాబు సిగ్నల్ ఇస్తేనే వారాహి బయటకు వస్తుందా అని ప్రశ్నించారు. పవన్ ప్రచారానికి చంద్రబాబు అనుమతి కావాలన్నారు. చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టాడని, జనసేన తగ్గడమేకానీ పెరిగేది లేదన్నారు. వందమంది చంద్రబాబులు, వెయ్యి మంది పవన్ కల్యాణ్లు అడ్డుపడినా రాజధాని ప్రాంతంలో ఇంటి పట్టాలు ఇచ్చి తీరుతామని మంత్రి చెప్పారు. ‘పేదలకు రాజధానిలో స్థానం ఇవ్వరా? 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్లో 10 మందితో కోర్టులో కేసులు వేయించింది చంద్రబాబే. లోకేశ్‌ను ఓడించేందుకు మేము రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వట్లేదు’ అని అంబటి వివరించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని కంటెపూడిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాగలక్ష్మికి రూ.లక్ష నగదు, ట్రైసైకిల్ ఇస్తానని, పేద విద్యార్థిని లావణ్యను పూర్తిస్థాయిలో చదివిస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్