విద్యుత్తు వినియోగదారులపై రూ.56,188 కోట్ల భారం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి కారణంగా విద్యుత్తు వినియోగదారులపై రూ.56,188 కోట్ల భారం పడిందని మాజీ మంత్రి, తెదేపా విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.

Published : 21 May 2023 03:44 IST

తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి కారణంగా విద్యుత్తు వినియోగదారులపై రూ.56,188 కోట్ల భారం పడిందని మాజీ మంత్రి, తెదేపా విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం ఆయన నివాసంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. విద్యుత్తు టారిఫ్‌ల కుదింపు, స్లాబుల మార్పు, ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, అదనపు డిపాజిట్ల పేరుతో జగన్‌ ప్రభుత్వం 7 సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచిందన్నారు. దీనివల్ల వినియోగదారులపై రూ.17,093 కోట్ల మేర భారం పడిందన్నారు. ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన అప్పు రూ.36,261 కోట్లు, హిందూజాకు చెల్లించేందుకు తెచ్చిన అప్పు రూ.2,834 కోట్లు.. ఇలా మొత్తం రూ.56,188 కోట్ల భారం ప్రజలపై పడిందన్నారు. ఇప్పటికైనా జగన్‌ చిత్తశుద్ధితో పనిచేసి వినియోగదారులకు కోతలు లేని విద్యుత్తును సరఫరా చేయాలన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించి, అన్నదాతలకు అదనపు భారమవుతున్న మోటార్లకు పెట్టే మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని