111 జీవో పరిధిలో భూబదిలీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 111 జీవో పరిధిలో జరిగిన భూబదిలీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 21 May 2023 04:24 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 111 జీవో పరిధిలో జరిగిన భూబదిలీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే ఈ జీవో రద్దు విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఆయన శనివారం అసెంబ్లీ మీడియాహాలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 111 జీవో పరిధిలో 84 గ్రామాల్లోని భూముల అమ్మకాలు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయని, వాటిని రైతుల దగ్గర నుంచి బడాబాబులు తక్కువ ధరకు దక్కించుకున్నారన్నారు. ఇప్పుడా జీవో రద్దుతో లాభపడేది రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులే అన్నారు. హైదరాబాద్‌కు పైసా ఖర్చు లేకుండా వచ్చే నీటిని పక్కనపెట్టి కాళేశ్వరం నీళ్లు తెస్తామనడమేంటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లను నిర్వీర్యం చేయడం క్షమించరాని నేరమన్నారు. రూ.2 వేల నోటు ఉపసంహరణపై స్పందిస్తూ.. అవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాయని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని