మంత్రివర్గ ఉపసంఘాల సిఫార్సులను బయటపెట్టాలి

రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేసి ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 21 May 2023 04:30 IST

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

పంజాగుట్ట, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేసి ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. హైదరాబాద్‌ లక్డీకాపుల్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు, ధరణి పోర్టల్‌, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, అక్రమ లేఅవుట్లు, గ్రామకంఠం క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘాలు చేసిన సిఫార్సులను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు పోడుపట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్ల ధరణి పోర్టల్‌లో లక్షల ఎకరాల పేదల ఎసైన్డ్‌ భూములు నిషేధిత జాబితాలో నమోదయ్యాయని విమర్శించారు. బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయం చేస్తామని కేసీఆర్‌ ప్రకటించడం ఎన్నికల గిమ్మిక్కే అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని