డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి

కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రానున్న ఎన్నికల్లో భాజపాకు ఓటేసి గెలిపించాలని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే అన్నారు.

Published : 22 May 2023 04:03 IST

కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌పాండే

అచ్చంపేట టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రానున్న ఎన్నికల్లో భాజపాకు ఓటేసి గెలిపించాలని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం నల్లమల లోతట్టు ప్రాంతంలోని భౌరాపూర్‌లో చెంచులతో మంత్రి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, భారాస నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ సరిపడా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నా.. భారాస ప్రభుత్వం లబ్ధిదారులకు సక్రమంగా అందించలేకపోతోందన్నారు.  డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ల కారణంగానే మధ్యప్రదేశ్‌, గుజరాత్‌,  ఉత్తర్‌ప్రదేశ్‌ గిరిజనుల జీవితాల్లో మార్పు సాధ్యమైందన్నారు. నల్లమల ప్రజల జీవితాలు కూడా బాగుపడాలంటే భాజపాకు పట్టం కట్టాలన్నారు. మహేంద్రనాథ్‌ శనివారం రాత్రి అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లో బస చేయాల్సి ఉన్నప్పటికీ వర్షం కురిసి విద్యుత్తు సమస్య ఏర్పడటంతో నేరుగా శ్రీశైలం వెళ్లారు. ఉదయం ఫర్హాబాద్‌ బేస్‌ క్యాంపు వద్ద భాజపా నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు