నెల రోజులు వేచి చూస్తాం
అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం వల్ల నిర్వాసితులైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కంటితుడుపులా ఉండబోవని భావిస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అన్నమయ్య డ్యామ్ బాధితులకు సాయంపై పవన్ కల్యాణ్
ఈనాడు, అమరావతి: అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం వల్ల నిర్వాసితులైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కంటితుడుపులా ఉండబోవని భావిస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎంతమేర నెరవేరుస్తుందో తెలుసుకునేందుకు నెల రోజులు వేచి చూస్తామని ట్విటర్‌లో ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు నెలలో ఇళ్లను నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీకి సంబంధించి ‘ఈనాడు’లో వచ్చిన వార్తను జోడించారు.
మొక్కజొన్న కొనుగోలుకు ఆంక్షలా?
ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజం
ఈనాడు, అమరావతి: మొక్కజొన్న కొనుగోలుకు సవాలక్ష ఆంక్షలు పెట్టి.. రైతుల్ని సతాయిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. అకాలవర్షాలు, ఈదురుగాలులతో పంట దెబ్బతిన్న రైతుల్ని ఆదుకుంటామని, మొక్కజొన్నను కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆర్‌బీకేల్లో నమోదు చేసుకోవాలని, అయిదెకరాల వరకు పంటనే కొనుగోలు చేస్తామని మెలిక పెట్టారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన విమర్శించారు. అంటే మిగిలిన పంటను రైతులు పారబోసుకోవాలా? అని ప్రశ్నించారు. మొక్కజొన్నను కొనుగోలు చేయలేని సీఎం జగన్.. మూడు రాజధానులు కడతానంటే జనం విశ్వసిస్తారా? అని ఎద్దేవా చేశారు. ‘నాలుగేళ్లుగా రైతులు ఏ పంట వేసినా నష్టాలే.. రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. వ్యవసాయరంగాన్ని దళారుల చేతిలో పెట్టిన రైతు ద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి. రైతు భరోసా కేంద్రాలు పెద్ద బోగస్.. ఆరుగాలం పండించిన మొక్కజొన్న కళ్లముందే తడవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారికి సాయం చేయడానికి సీఎంకు మనసు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకుని.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించేలా పంటలు కొనుగోలు చేయాలి’ అని సత్యప్రసాద్ డిమాండు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు