పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసి బీసీలు వారి హక్కులు పొందేలా చూడాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Published : 22 May 2023 05:33 IST

రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య

తిరుమల, న్యూస్‌టుడే: పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసి బీసీలు వారి హక్కులు పొందేలా చూడాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 52 శాతానికిపైగా ఉన్న బీసీలు ఇప్పటికీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దోపిడీకి, అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సంఖ్యకు అనుగుణంగా రాజకీయంగా, సామాజికంగా 50 శాతం అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం బీసీ వర్గానికే చెందిన ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చట్టం చేసి బీసీ బిల్లును ఆమోదింపజేయాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు