అభివృద్ధి కోసం ముళ్ల పందినైనా వాటేసుకుంటా: ఎంపీ కేశినేని

విజయవాడ నగర ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధికి సహకారం అందించే ఎవరినైనా వాటేసుకుంటానని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు

Updated : 23 May 2023 07:34 IST

విజయవాడ, న్యూస్‌టుడే : విజయవాడ నగర ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధికి సహకారం అందించే ఎవరినైనా వాటేసుకుంటానని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సప్పా శివకుమార్‌కు సీఎన్‌జీ ఆటోను కేశినేని భవన్‌ వద్ద ఎంపీ కేశినేని నాని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ ‘నాకు టికెట్‌ వస్తుందా..? రాదా..? రేపు ఎంపీ అవుతానా? కానా? అనే అభిప్రాయం లేదు. టికెట్‌ ఇస్తే పోటీ చేస్తాను. లేకపోతే కేశినేని భవన్‌లో కూర్చుని ప్రజలకు సేవ చేస్తాను. విజయవాడ అభివృద్ధికి గొంగళిపురుగునైనా, ఎలుగుబంటి అయినా, ముళ్ల పందినైనా వాటేసుకుంటాను...’ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు ఉదయభాను, మొండితోక జగన్మోహనరావులు వైకాపాలో ఉన్నప్పటికీ వారిని సమన్వయం చేసుకుంటూ ఎంపీ లాడ్స్‌ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నట్లు చెప్పారు. వారితో తనకు ఏ విధమైన భాగస్వామ్యం లేదని, చీకటి సామ్రాజ్యాలు లేవన్నారు. ఇసుక, మైనింగ్‌లో వాటాలు రాకపోతే ధర్నాలు చేసే వారున్నారని, తాను అలాంటి వ్యక్తిని కాదని ఎంపీ కేశినేని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు