YS Avinash Reddy-CBI: కర్నూలులో హైడ్రామా.. సోషల్‌ మీడియాలో సెటైర్లు..

వైఎస్‌ వివేకా హత్య కేసులో వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించే వ్యవహారం, కర్నూలు కేంద్రంగా జరుగుతున్న హైడ్రామాపై సామాజిక మాధ్యమాల్లో పలువురు వాగ్బాణాలు సంధిస్తున్నారు.

Updated : 23 May 2023 09:59 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్‌ వివేకా హత్య కేసులో వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించే వ్యవహారం, కర్నూలు కేంద్రంగా జరుగుతున్న హైడ్రామాపై సామాజిక మాధ్యమాల్లో పలువురు వాగ్బాణాలు సంధిస్తున్నారు. టామ్‌ అండ్‌ జెర్రీ ఆటను తలపిస్తోందని ట్వీట్‌ చేస్తున్నారు.

‘ఆంధ్రప్రదేశ్‌ న్యాయ రాజధాని ఎలా ఉండబోతోందో రాష్ట్ర ప్రజలకు జగన్‌రెడ్డి రుచి చూపిస్తున్నారు’ అంటూ ఒకరు... ‘సీబీఐ అధికారులు ఆంధ్రా సీఐడీ అధికారుల్ని డిప్యూట్‌ చేసుకుంటే... అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు తోసేసి అరెస్ట్‌ చేసే అనుభవం వారికి ఉపయోగపడొచ్చు’ అని మరొకరు.... ‘హైదరాబాద్‌లో సీటీ బస్సెక్కి శంషాబాద్‌లో దిగి టిఫిన్‌ చేసి....ఆ తర్వాత ఆర్డినరీ బస్సెక్కి జడ్చర్లలో దిగి టీ తాగి.. ఆపై తెల్ల ఆటో ఎక్కి కొత్తకోటలో దిగి అల్లం చెట్నీతో మైసూరు బోండాలు తిని ఆంధ్రా పల్లె వెలుగు బస్‌ ఎక్కినా ఈ పాటికి కేంద్ర బలగాలు కర్నూలు చేరుకోవాలి కదా?...ఎంటో ఇంతకీ వస్తారంటారా?’ అని ఇంకొకరు సామాజిక మాధ్యమాల్లో చమత్కరిస్తున్నారు. ఇవి పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి.


అరెస్టయ్యే వరకు రోజూ 4 బకెట్ల పాప్‌కార్న్‌ పంపిణీ చేయండి!

- కొలికపూడి శ్రీనివాస్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి నమస్కారం... అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రోజూ నాలుగు బకెట్ల పాప్‌ కార్న్‌, రెండు లీటర్ల కూల్‌డ్రింక్‌ బాటిల్‌ను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.


సీబీఐ మీద కాస్త దయచూపండి అవినాష్‌రెడ్డి గారూ!

- కందుల రమేశ్‌

అవినాష్‌రెడ్డిగారూ!...పిచ్చిచూపులు చూస్తున్న సీబీఐ మీద దయచూపించండి. కనికరించండి. సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ప్రపంచానికే హీరోగా నిలిచిన మోదీగారి చేతిలో చేతకాని సీబీఐ ఉందన్న చెడ్డ పేరు తీసుకురాకండి! ప్లీజ్‌ లొంగిపొండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని