Btech Ravi: అవినాష్‌ చేతిలో సీఎం అక్రమ సంపాదన గుట్టు: బీటెక్‌ రవి కీలక వ్యాఖ్యలు

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టును ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపించారు.

Updated : 24 May 2023 07:38 IST

అరవిందనగర్‌(కడప), న్యూస్‌టుడే: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టును ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపించారు. మంగళవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి అక్రమ సంపాదన రూ.2000 నోట్ల రూపంలో భద్రపరిచినట్లు నాకు సమాచారం ఉంది. అవినాష్‌రెడ్డి వేలిముద్రతో లాకర్లలోని రూ.రెండు వేల నోట్లు తెరిచి బ్యాంకుల్లో మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తే ఆ డబ్బును మార్చుకోలేమన్న భయంతో ముఖ్యమంత్రి నాటకాలు ఆడిస్తున్నారు. అలాగే అరెస్టు జరిగితే వైకాపాకు తీరని నష్టం వాటిల్లుతుంది. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు కాకుండా చూసుకోవాలనే ఇదంతా చేస్తున్నారు. ఆ రోజున కొత్తగా బాధ్యతలు స్వీకరించే సీబీఐ డైరెక్టర్‌ తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని పులివెందులలోని వైకాపా నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు..’ అని మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పేర్కొన్నారు. గతంలో సీబీఐ విచారణలో అవినాష్‌ తాడేపల్లెకు సంబంధించిన పేర్లు బయటపెట్టారని.. ఇప్పుడు ఆయన అరెస్టు అయితే తలెత్తే ఇబ్బందులతో సీఎం భయపడుతున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని