క్విజ్‌ పోటీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న పీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి రోహిత్‌ చౌదరి విజ్ఞప్తి చేశారు.

Published : 24 May 2023 05:03 IST

ఏఐసీసీ ఇన్‌ఛార్జి రోహిత్‌ చౌదరి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న పీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి రోహిత్‌ చౌదరి విజ్ఞప్తి చేశారు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో ఆన్‌లైన్‌ క్విజ్ పోటీ సన్నాహక సమావేశం జరిగింది. నాయకులు వీహెచ్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌, జగదీశ్‌, రోహిన్‌రెడ్డి, ప్రీతం, ఇందిర, మహిళా కార్యకర్తలు హాజరయ్యారు. పోటీలపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. రోహిత్‌ చౌదరి మాట్లాడుతూ పురుషులతో సమానంగా 16 నుంచి 35 ఏళ్ల వరకు మహిళలు పోటీలో పాల్గొని సత్తా చాటాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలు నిర్వహించనున్నట్లు సునీతారావు తెలిపారు. ఆసక్తిగల వారు జూన్‌ 1లోపు 76618 99899 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఏఐసీసీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ఫోన్‌ ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని