అవినాష్‌రెడ్డి నాటకాలు ఆపాలి.. ఎంపీ రఘురామకృష్ణరాజు

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిలు వచ్చే అవకాశాలు లేవని, ఆయన ఇకనైనా నాటకాలు ఆపాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Published : 26 May 2023 07:50 IST

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిలు వచ్చే అవకాశాలు లేవని, ఆయన ఇకనైనా నాటకాలు ఆపాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ ముందుకు రావాలని ఆయన కోరారు. దిల్లీలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అవినాష్‌రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన సీఐని తమ పార్టీ నేతలు కొందరు కొట్టినట్లు తెలిసిందన్నారు. ఆ సీఐని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి దూషించినట్లు తెలిసిందన్నారు. ఆమె ఆరోగ్యం బాగుందని చెప్పిన వైద్యులకు భద్రత కల్పించాల్సిన అవసరం కనబడుతోందన్నారు. విశాఖపట్నంలో స్వీయ పట్టాభిషేకం చేసుకున్న సీఎం జగన్‌ అమరావతిలో తనది కాని భూముల్లో పేదలకు ‘పట్టా’భిషేకం చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవస్థానమని సీఎం జగన్‌ అంటున్నారని, అలాంటప్పుడు పార్లమెంటు సభ్యులు దేవుళ్లే కదా అన్నారు. పార్లమెంటు సభ్యుడినైన తనను గొడ్డును బాదినట్లు బాదించారని, ఇప్పుడేమో పార్లమెంటు ప్రజాస్వామ్యానికి దేవస్థానం అని సీఎంకు గుర్తుకొచ్చిందా అని  ప్రశ్నించారు. రాజధాని అమరావతికి అనుకూలంగా ఆందోళన చేస్తున్నవారికి మద్దతు ఇచ్చిన జడ శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేయడం, మూడు రాజధానులకు అనుకూలంగా ఆందోళన చేస్తున్నవారికి అనుమతి ఇవ్వడంపై మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని