YSRCP: మహానాడు వేళ.. వైకాపా కవ్వింపు చర్యలు

రాజమహేంద్రవరం సమీపంలో తెదేపా మహానాడులో భాగంగా నగర, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ నేతలు ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటుచేశారు. వాటి మధ్యలో ఉన్నట్టుండి వైకాపా ఫ్లెక్సీలు వెలిశాయి.

Updated : 27 May 2023 06:46 IST

రాజమహేంద్రవరం (టి.నగర్‌) న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం సమీపంలో తెదేపా మహానాడులో భాగంగా నగర, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ నేతలు ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటుచేశారు. వాటి మధ్యలో ఉన్నట్టుండి వైకాపా ఫ్లెక్సీలు వెలిశాయి. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ చిత్రాలతో ఇవి వెలిశాయి. నగరంలో పలుచోట్ల జాతీయ రహదారిపై వీటిని ఏర్పాటు చేశారు. నగరంలో తాము పెట్టిన కొన్ని ఫ్లెక్సీలు శుక్రవారం ఉదయానికి చిరిగి, పడిపోయి ఉండటంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజలు, ప్రతిపక్షాలను ఎలా ఇబ్బంది పెడుతున్నారో రాజమహేంద్రవరంలోనూ కొందరు నాయకులు అదే ధోరణి ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దగ్గర మెప్పు కోసం ఎంపీ భరత్‌ వివాదాస్పద చర్యలకు పాల్పడుతున్నారని గుడా మాజీ ఛైర్మన్‌ గన్ని కృష్ణ ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని