రాజకీయాలు చేయడానికీ ఓ హద్దు ఉండాలి: జైశంకర్‌

పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని 20 రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ స్పందించారు.

Published : 27 May 2023 05:02 IST

గాంధీనగర్‌: పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని 20 రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ స్పందించారు. ఆయా పార్టీల తీరు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేయడానికీ ఒక హద్దు ఉండాలని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌కు వచ్చిన ఆయన రాజ్‌పిప్లా పట్టణంలో మీడియాతో మాట్లాడారు. నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవాన్ని యావత్‌ దేశం ఓ పండుగలా చేసుకోవాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని