‘పోడు పట్టాల’ హామీ అమలులో సీఎం విఫలం: పొంగులేటి

అధికారంలోకి రాగానే పోడు పట్టాల మంజూరు దస్త్రంపై తొలి సంతకం చేస్తానన్న సీఎం కేసీఆర్‌ హామీ అమలులో విఫలమయ్యారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

Published : 28 May 2023 04:37 IST

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: అధికారంలోకి రాగానే పోడు పట్టాల మంజూరు దస్త్రంపై తొలి సంతకం చేస్తానన్న సీఎం కేసీఆర్‌ హామీ అమలులో విఫలమయ్యారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. గిరిజనులకు న్యాయం చేయకపోగా, అటవీ భూముల ఆక్రమణల పేరుతో వారినే జైళ్లల్లోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. పొంగులేటి ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెంలో ‘పోడు భరోసా యాత్ర’ నిర్వహించారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాలనలో సీఎం ఒక్క గిరిజన రైతుకూ పోడు పట్టా ఇవ్వలేదన్నారు. ఎన్నికలొస్తేనే ఆయనకు వారు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగూడెంలో కుర్చీ వేసుకుని కూర్చుని మరీ పట్టాలిప్పిస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. భూమి హక్కు పత్రాల కోసం చేసిన పోరాటాల్లో చనిపోయిన గిరిజనుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీలపై అటవీశాఖ అక్రమంగా బనాయించిన కేసులు ఎత్తివేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని