వివేకా హత్యపై జగనే జవాబు చెప్పాలి

‘మీ బాబాయ్‌ని సాక్షాత్తూ మీ వారే చంపారని, ఇది అంతఃపురం హత్య అని సీబీఐ చెప్పింది. అవినాష్‌రెడ్డి మీతో టచ్‌లో ఉన్నారని, హత్య చేసే ముందు.. తర్వాత అవినాష్‌ ఇంట్లోనే దోషులంతా ఉన్నారని సీబీఐ పేర్కొంది.

Updated : 28 May 2023 06:52 IST

సీబీఐ స్పష్టత ఇచ్చినా మాపై ఆరోపణలా?
మహానాడు సభలో చంద్రబాబు ధ్వజం

ఈనాడు, కాకినాడ: ‘మీ బాబాయ్‌ని సాక్షాత్తూ మీ వారే చంపారని, ఇది అంతఃపురం హత్య అని సీబీఐ చెప్పింది. అవినాష్‌రెడ్డి మీతో టచ్‌లో ఉన్నారని, హత్య చేసే ముందు.. తర్వాత అవినాష్‌ ఇంట్లోనే దోషులంతా ఉన్నారని సీబీఐ పేర్కొంది. ఈ విషయాలు జగన్‌కూ తెలుసని వివరించింది. వీటిపై సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను చంద్రబాబు నిలదీశారు. మహానాడులో భాగంగా ప్రవేశపెట్టిన ‘రాక్షస పాలన-రాజకీయ రాబందుల స్వైరవిహారం’పై తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ వేసిన అదనపు అఫిడవిట్లో సీఎం జగన్‌ పేరు స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. హత్య వీళ్లే చేసి, ముందు గుండెపోటు అని చెప్పి.. తర్వాత నాపై ఆరోపిస్తూ ‘నారాసుర రక్తచరిత్ర’ అని రాసి ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని