160 స్థానాలతో... చంద్రబాబు సీఎం అవుతారు

‘రాష్ట్రానికి 2014-2019 మధ్య స్వర్ణయుగం. రాజధాని లేకపోయినా, రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నా.. సమర్థ నాయకుడైన చంద్రబాబు సీఎం కావడంతో ప్రజలకు కష్టం తెలియలేదు.

Published : 28 May 2023 06:05 IST

కె.అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

‘రాష్ట్రానికి 2014-2019 మధ్య స్వర్ణయుగం. రాజధాని లేకపోయినా, రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నా.. సమర్థ నాయకుడైన చంద్రబాబు సీఎం కావడంతో ప్రజలకు కష్టం తెలియలేదు. సంక్షేమ పథకాల్ని అమలు పరుస్తూనే అభివృద్ధి చేసి చూపించాం’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ.. ‘5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాలాంటి వాళ్లమే జగన్‌ తీరుతో భయపడే పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ పార్టీ కార్యకర్తలు సర్వం కోల్పోయినా వెన్నుచూపలేదు. చంద్రబాబు నాయకత్వంలో నాలుగున్నరేళ్లుగా పగలూరాత్రీ కష్టపడ్డారు. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 స్థానాలతో చంద్రబాబు సీఎం అవుతారు’ అని స్పష్టంచేశారు.  ‘సానుభూతి పొంది సీఎం కావాలనే తలంపుతోనే తన బాబాయ్‌ని జగన్‌ చంపించాడని మేం ముందే చెప్పాం. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ అయితే కేసు తనమీదకు వస్తుందనే ఆందోళనలో జగన్‌ ఉన్నారు’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘జగన్‌కు ఇప్పటికే ఉన్న ఏడు బంగళాలు చాలవన్నట్లు వైజాగ్‌లో మరో కొంప పెడతారట. ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారట’ అని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు