ఈ యాప్‌ ఉంటే.. బాబుకు చేరువగా ఉన్నట్లే!

తెదేపా కార్యకర్తలను చంద్రబాబుకు మరింత దగ్గర చేసేందుకు ఆ పార్టీ సాంకేతిక విభాగం ‘మన టీడీపీ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Published : 28 May 2023 06:05 IST

తెదేపా కార్యకర్తలను చంద్రబాబుకు మరింత దగ్గర చేసేందుకు ఆ పార్టీ సాంకేతిక విభాగం ‘మన టీడీపీ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మహానాడులో యాప్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష మంది యాప్‌ను వినియోగిస్తున్నారని యాప్‌ హెడ్‌ విన్‌సియా తెలిపారు. ఇది డిజిటల్‌ అస్త్రంగా ఉపకరిస్తుందన్నారు. శిబిరంలో ఐటీడీపీ, మన టీడీపీ సభ్యులు 100 మంది సేవలందిస్తున్నారు. యాప్‌లో ‘సీబీఎన్‌ కనెక్ట్‌’ అనే ఆప్షన్‌ దగ్గర క్లిక్‌ చేసి ఆయా ప్రాంతాల సమస్యలు తెలియజేయవచ్చు. పార్టీ బలోపేతానికి సూచనలు, క్షేత్రస్థాయి పరిస్థితులూ నమోదు చేస్తే.. అవి నేరుగా పార్టీ అధినేత దృష్టికి వెళ్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు