అన్నతో అనుబంధం అలా...
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొందరు నాయకులతో ఆత్మీయ అనుబంధం సాగింది.
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, టి.నగర్
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొందరు నాయకులతో ఆత్మీయ అనుబంధం సాగింది. పార్టీ ఆవిర్భావం మొదలుకుని ఎన్నికల చైతన్యయాత్ర, ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో ఇక్కడి నాయకులు కీలకపాత్ర పోషించారు. మారిన రాజకీయ పరిస్థితుల ఆధారంగా కొందరు పార్టీలు మారినా అనేకమంది పార్టీ స్థాపన నుంచి ఇప్పటికీ పసుపు జెండానే భుజాన మోస్తున్నారు. అన్న ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారిలా...
ఆత్మీయంగా పలకరించేవారు..
అన్న నందమూరి తారక రామారావు తొలుత రాజమహేంద్రవరంలో పంచవటి హోటల్ ప్రారంభానికి వస్తే దాని యజమాని నన్ను ఆయనకు పరిచయం చేశారు. దివిసీమ ఉప్పెన సమయంలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ తదితరులు జోలె పట్టి విరాళాలు సేకరించిన సమయంలో నా దుకాణం వద్దకు రాగానే సొరుగులో ఉన్న డబ్బులన్నీ వేశా. 1982లో పార్టీ ఆవిర్భావం తరువాత ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. నాపై నమ్మకంతో పార్టీ జిల్లా సమన్వయకర్తగా నియమించి అభ్యర్థుల ఎంపిక విషయంలో నా నిర్ణయానికి ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్నీ ఆత్మీయంగా పలకరించేవారు. ఆ అనుబంధం మరిచిపోలేనిది.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు
రాజకీయం అంటే సేవ
ప్రజలే నా దేవుళ్లు.. సమాజమే దేవాలయం అనే నినాదంతో.. రాజకీయం అంటే సేవ అని.. వ్యాపారం కాదని అన్న ఎన్టీఆర్ చెప్పిన మాటలు నేను ఇప్పటికీ పాటిస్తున్నా. పార్టీ ఆవిర్భావం తరువాత కాంగ్రెస్‌కు భయపడి తెదేపా వైపు వెళ్లేందుకు అంతా వెనుకంజ వేసేవారు. ఆ సమయంలో ధైర్యం చేసి హైదరాబాద్ వెళ్లి ఎన్టీఆర్‌ను కలిశా. తరువాత పార్టీ సభ్యత్వ నమోదు అందరికంటే మెరుగ్గా చేయడంతో నన్ను అభినందించారు. అప్పటి వరకు కాంగ్రెస్‌లో సంపన్నులు, ఉన్నత వర్గాలకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే సంప్రదాయం. తెదేపా నుంచి ఆశావహులు సైతం తక్కువే. పార్టీ సర్వేలు చేసి విద్యావంతులు, యువతకు టికెట్ ఇచ్చేది. ఈ క్రమంలో నా ఆర్థిక పరిస్థితి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరిపడదనే నివేదిక ఎన్టీఆర్ వద్దకు చేరింది. నన్ను పిలిచి ఆ అంశంపై మాట్లాడారు. నేను నిర్వహిస్తున్న క్యాంటీన్, డెయిరీ, హోటల్ గురించి వివరించి ప్రచారానికి ఖర్చు చేసుకోగలనని చెప్పడంతో టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన ఆత్మీయత, ఇతరులపై చూపే ప్రేమ, గౌరవ మర్యాదలు ఎన్నటికీ మరిచిపోలేనివి.
చిక్కాల రామచంద్రరావు, మాజీ మంత్రి
పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు
తెదేపా ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో పార్టీలో చేరా. తరువాత ఉద్యోగ అవకాశాలు వచ్చినా పెద్దగా ఆసక్తి చూపలేదు. 1987లో ఎంపీపీగా అవకాశం కల్పించారు. తరువాత పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 22 ఏళ్లపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా సేవలందించే అవకాశం దక్కింది. 1993లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రజాగర్జన సమయంలోనూ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేనే ఉన్నా. ఎన్టీఆర్ నుంచి గౌరవ మర్యాదలు నేర్చుకున్నా. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తున్నా. పార్టీకి సేవ చేయడంలోనే నాకు సంతృప్తి.
నిమ్మకాయల చినరాజప్ప, పొలిట్ బ్యూరో సభ్యుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్: రష్మిక
-
Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
-
MS Swaminathan: దేశ ‘వ్యవసాయం తలరాత’నే మార్చి.. 84 డాక్టరేట్లు పొంది!
-
AIADMK: మళ్లీ ఎన్డీయేలో చేరం.. అన్నామలైని తొలగించాలని మేం కోరం: అన్నాడీఎంకే
-
USA: అమెరికా పిల్లలకి ‘లెక్కలు’ రావడం లేదట..!
-
MS Swaminathan: దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది: కేసీఆర్