ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం

ప్రపంచ ప్రముఖుల అభినందనలు సైతం అందుకుంటున్న ప్రధాని మోదీ నూతన పార్లమెంటును ప్రారంభిస్తే ప్రతిపక్షాలు విమర్శించడం అర్థరహితమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

Published : 29 May 2023 03:42 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: ప్రపంచ ప్రముఖుల అభినందనలు సైతం అందుకుంటున్న ప్రధాని మోదీ నూతన పార్లమెంటును ప్రారంభిస్తే ప్రతిపక్షాలు విమర్శించడం అర్థరహితమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. స్థానిక జిల్లాపరిషత్‌ దరి రాజస్థానీ సాంస్కృతిక్‌ మండలిలో ఆదివారం జరిగిన ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నూతన పార్లమెంటు భవనం ప్రారంభిస్తే కేసీఆర్‌, మమతా బెనర్జీలాంటి వారు విమర్శించడమేంటని ప్రశ్నించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి నూతన పార్లమెంటు భవనం ప్రారంభించకూడదా? అని ప్రశ్నించారు. ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్రమోదీ ఎన్టీఆర్‌ గురించి ప్రస్తావించడం ఆనందదాయకమన్నారు. త్వరలో కర్నూలులో పెద్దఎత్తున బీసీ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా భాజపాలో చేరిన పలువురికి పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసినీ ఆనంద్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని