జూన్‌ 12న పట్నాలో విపక్షాల భేటీ!

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టుకడుతున్న విపక్ష పార్టీలు జూన్‌ 12వ తేదీన  పట్నాలో భేటీ కానున్నట్లు సమాచారం.

Published : 29 May 2023 04:33 IST

దిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టుకడుతున్న విపక్ష పార్టీలు జూన్‌ 12వ తేదీన  పట్నాలో భేటీ కానున్నట్లు సమాచారం. ఇందులో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌ సహా 20 ప్రతిపక్ష పార్టీలు పాల్గొననున్నాయి. ఈ భేటీకి 18 పార్టీల అధ్యక్షులు హాజరవుతారని అంచనా. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత భేటీగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. భాజపాను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే వీలు ఉంది. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే  ఆయన ప్రతిపక్ష పార్టీల భేటీకి తేదీని నిర్ణయించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని