‘ఆ విగ్రహాన్ని తొలగిస్తే తుపాకీతో కాల్చేస్తా!’.. మాజీ మంత్రి చిన్నారెడ్డి

వనపర్తిలో చేపట్టిన రహదారి విస్తరణ సందర్భంగా.. ‘రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించాలని చూస్తే తుపాకీతో కాల్చేస్తా’ అని మాజీ మంత్రి చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Updated : 29 May 2023 11:30 IST

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: వనపర్తిలో చేపట్టిన రహదారి విస్తరణ సందర్భంగా.. ‘రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించాలని చూస్తే తుపాకీతో కాల్చేస్తా’ అని మాజీ మంత్రి చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వనపర్తి జిల్లాకేంద్రంలో రోడ్డు విస్తరణ సందర్భంగా పాత బజార్‌లోని దర్గా, ఓ ఆలయ స్వాగత తోరణం తొలగించడంతో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘‘దర్గాలు, ఆలయాలను తొలగించకుండా రహదారి విస్తరణ పనులు చేసివుంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కూడళ్లలో జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించాలని చూడటం ఎంతవరకు సమంజసం? మంత్రి నిరంజన్‌రెడ్డి మెప్పు కోసమే అధికారులు, పోలీసులు పనిచేస్తున్నారు’’ అని ఆరోపించారు. ప్రార్థనామందిరాలు, ఆలయాలను తొలగించడం మానుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారాస నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, సీఐ మహేశ్వర్‌రావు, ఎస్సై యుగంధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం తొలగింపులు చేపట్టిన చోట కాంగ్రెస్‌ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు