రాష్ట్రాభివృద్ధిపై భాజపా నేతలకు చిత్తశుద్ధి లేదు
భాజపా నేతలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏమాత్రం అవగాహన లేదని, ఆ పార్టీ ఎంపీలు తెలంగాణ స్పృహ పెంచుకోవాలని ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు విమర్శించారు.
ప్రభుత్వ విప్‌లు సునీత, బాలరాజు
ఈనాడు, హైదరాబాద్: భాజపా నేతలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏమాత్రం అవగాహన లేదని, ఆ పార్టీ ఎంపీలు తెలంగాణ స్పృహ పెంచుకోవాలని ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై భాజపా నేతలకు చిత్తశుద్ధి లేదని, తెలంగాణకు ప్రత్యేకంగా ఏంతెచ్చారో వారు శ్వేతపత్రం విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు. భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్‌లు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ గురించి భాజపా నేతలు ఆలోచించి మాట్లాడాలి. దేశాన్ని బాగుచేసేందుకే భారాస పక్క రాష్ట్రాలకు పోతోంది. కేసీఆర్‌పై నమ్మకంతో ఎందరో నేతలు భారాసతో కలిసేందుకు వస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ విషయాన్ని ప్రధాని మోదీతో చర్చించి నిర్ణయిస్తామని భాజపా నేతలు అనడం విడ్డూరం. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేదు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెడతారని అనుకున్నాం. ఈ ప్రారంభోత్సవానికి ఎన్ని పార్టీలు వచ్చాయి? ఎందరు ఎంపీలు వచ్చారో కేంద్ర మంత్రి చెప్పాలి. అంబేడ్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారు. దేశఖ్యాతిని పెంచే పని భాజపా చేయడం లేదు. దమ్ముంటే మిషన్ భగీరథ పెండింగ్ నిధులు తెచ్చి ఆ పార్టీ నేతలు ఇక్కడ మాట్లాడాలి’’ అని ప్రభుత్వ విప్‌లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
-
Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు