భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం

భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు.

Updated : 29 May 2023 05:35 IST

దిల్లీ: భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు. పార్టీ సుపరిపాలన ఎజెండాలో భాగంగా ఈ భేటీ జరిగింది. ఇందులో సీఎంలు.. పాలనలో తాము అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. భాజపా కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎంలు యోగి ఆదిత్యనాథ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (హరియాణా), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌), పుష్కర్‌ సింగ్‌ ధామి (ఉత్తరాఖండ్‌) తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, యూపీ డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేశ పాఠక్‌ కూడా హాజరయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని