అల్పాహారంలో 6 రకాలు

తెదేపా మహానాడు ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ఉదయం 5 గంటలకే అల్పాహారం సిద్ధం చేశారు.

Published : 29 May 2023 05:09 IST

తెదేపా మహానాడు ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ఉదయం 5 గంటలకే అల్పాహారం సిద్ధం చేశారు. బహిరంగ సభ నిర్వహించే ప్రదేశం మొదలుకుని ప్రతినిధుల సభ వరకు మూడుచోట్ల భోజనాలు, అల్పాహార తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇడ్లీ, మైసూర్‌ బజ్జీ, పునుగులు, టమోటా బాత్‌, పొంగల్‌, ఉప్మా అందించారు. మధ్యాహ్నం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి వచ్చిన వారికి వెజ్‌ బిర్యానీ, సాంబారు అన్నం, పెరుగన్నం అందించారు. 


తెదేపా శ్రేణులకు చింతమనేని భోజనాలు

దుగ్గిరాల (పెదవేగి), న్యూస్‌టుడే: మహానాడుకు వెళ్లి తిరిగి వచ్చే తెదేపా నాయకులు, కార్యకర్తలకు భోజనాలు అందించేందుకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆదివారం పెదవేగి మండలం దుగ్గిరాలలో తన ఇంటివద్ద భారీగా వంటలు వండించారు. 40 వేల మందికి సరిపడా వంటకాలను సిద్ధం చేసినట్లు చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు. దాంతో ఆదివారం సాయంత్రం నుంచి భోజనాలు వడ్డించడం ప్రారంభించారు. పలు జిల్లాల వారు ఇక్కడ ఆగి భోజనాలు చేసి వెళ్లారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని