కుంభకోణాల కీచకుడిని సాగనంపాలి: బాలకృష్ణ

‘‘కుంభకోణాల కీచకుడు, రూ.లక్షల కోట్ల భక్షకుడు, పక్షపాత రూపకుడు, జగమెరిగిన జగన్నాటకుడు, రాష్ట్ర రావణుడు.. అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రిని సాగనంపాలి.

Published : 29 May 2023 05:09 IST

ఈనాడు, అమరావతి: ‘‘కుంభకోణాల కీచకుడు, రూ.లక్షల కోట్ల భక్షకుడు, పక్షపాత రూపకుడు, జగమెరిగిన జగన్నాటకుడు, రాష్ట్ర రావణుడు.. అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రిని సాగనంపాలి. ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలపై  బాదుడే.. బాదుడు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ అసమర్థ, చేతకాని ప్రభుత్వాన్ని పంపేసి, తెదేపాను అధికారంలోకి తీసుకురావాలి. గొప్ప దార్శనికుడు చంద్రబాబు నేతృత్వంలోని తెదేపాను అధికారంలోకి తీసుకొచ్చి, పునర్వైభవాన్ని తీసుకురావాలి’’ అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. బహిరంగ సభను ఉద్దేశించి ఆయన 26 నిమిషాలు మాట్లాడారు. ‘‘నవరత్నాల కోసం అప్పులు చేసిన రూ.8లక్షల కోట్లు ఏమైపోయాయో తెలియట్లేదు. కల్తీ మద్యంతో అవయవాలు దెబ్బతింటున్నాయి. తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మూడు రాజధానులు అని రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు’’ అని విమర్శించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని