బెంగాల్ అసెంబ్లీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్
పశ్చిమబెంగాల్ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకున్న ఏకైక సభ్యుడు భైరాన్ బిశ్వాస్ సోమవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిపోయారు.
ఏకైక ఎమ్మెల్యే టీఎంసీలో చేరిక
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకున్న ఏకైక సభ్యుడు భైరాన్ బిశ్వాస్ సోమవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిపోయారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. బెంగాల్‌లో అధికారపార్టీ అయిన టీఎంసీపై పోరాడుతుందో, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఎదిరిస్తుందో కాంగ్రెస్ తేల్చుకోవాలని బెనర్జీ అన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఏడాది మార్చిలో సాగర్ దిఘీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున భైరాన్ బిశ్వాస్ వామపక్షాల మద్దతుతో విజయం సాధించారు. అలా కాంగ్రెస్‌కు దక్కిన ఒక్కసీటు ఇప్పుడు చేజారిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రతిపక్షాలు సంకల్పించిన సమయంలో ఇది చోటుచేసుకుంది. బెంగాల్‌లో కాంగ్రెస్‌ను తుడిచిపెట్టాలనే తలంపు తమకు లేదని అభిషేక్ చెప్పారు. రాష్ట్రంలో అనేకమంది కాంగ్రెస్ సీనియర్లు టీఎంసీలో చేరాలని ఆశిస్తున్నా ప్రతిపక్ష ఐక్యత కోసం తాము వారికి తలుపులు మూసేశామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్
-
ODI WC 2023: హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. మేమంతా ఫిదా: పాక్ క్రికెటర్
-
Srinivas Goud: మోదీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?