రాజ్యసభ ఉపాధ్యక్షుడిపై జేెడీ (యూ) ఆగ్రహం

పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవాన్ని జనతాదళ్‌ (యునైటెడ్‌) బహిష్కరించినా, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ (66) హాజరవడంపై పార్టీ ప్రధాన ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ సోమవారం మండిపడ్డారు.

Published : 30 May 2023 05:11 IST

పట్నా: పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవాన్ని జనతాదళ్‌ (యునైటెడ్‌) బహిష్కరించినా, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ (66) హాజరవడంపై పార్టీ ప్రధాన ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ సోమవారం మండిపడ్డారు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ పాల్గొనకపోయినా ఉపాధ్యక్షుడు హరివంశ్‌ మాత్రం హాజరయ్యారని ఘాటుగా విమర్శించారు. బిహార్‌, ఝార్ఖండ్‌లలో ప్రముఖ దినపత్రిక ప్రభాత్‌ ఖబర్‌ సంపాదకునిగా పనిచేసిన హరివంశ్‌ ఆపై పూర్వ ప్రధాని చంద్రశేఖర్‌కు పత్రికా వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించారు. పాత్రికేయునిగా హరివంశ్‌ అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని ఆయన్ను జేడీ (యూ) రాజ్యసభకు పంపిందని, కానీ ఆయన తన గౌరవాన్ని నిలబెట్టుకోలేదని నీరజ్‌ కుమార్‌ విమర్శించారు. ఆయనపై ఏం చర్య తీసుకోవాలనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని