ప్రజల్ని భాజపా దోచుకుంటోంది: కాంగ్రెస్‌

కేంద్రంలో తొమ్మిదేళ్ల పాలనలో తీవ్రస్థాయి ద్రవ్యోల్బణంతో ప్రజల ఆదాయాన్ని భాజపా ప్రభుత్వం దోచుకుందనీ, పైపెచ్చు.. ధరల పెరుగుదలకు కళ్లెం వేసినట్లు గొప్పలు చెప్పుకొంటోందని కాంగ్రెస్‌ విమర్శించింది.

Published : 30 May 2023 05:11 IST

దిల్లీ: కేంద్రంలో తొమ్మిదేళ్ల పాలనలో తీవ్రస్థాయి ద్రవ్యోల్బణంతో ప్రజల ఆదాయాన్ని భాజపా ప్రభుత్వం దోచుకుందనీ, పైపెచ్చు.. ధరల పెరుగుదలకు కళ్లెం వేసినట్లు గొప్పలు చెప్పుకొంటోందని కాంగ్రెస్‌ విమర్శించింది. పేదల జీవితాలు ఏమాత్రం మెరుగుపడకపోయినా గొప్ప విజయాలు సాధించినట్లు ఊదరగొట్టడానికి మంత్రులు సిద్ధపడుతున్నారని తెలిపింది. ముఖ్యమైన అన్నింటినీ జీఎస్టీ దెబ్బ కొట్టిందనీ, బడ్జెట్లను తలకిందులు చేసి, జీవితాలను దుర్లభంగా మార్చిందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విటర్లో విమర్శించారు. నిత్యావసరాల ధరల పెరుగుదల ఒక్కటే ప్రభుత్వం సాధించిన విజయమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ ఎద్దేవా చేశారు. కూలీల వేతనాలు 0.2-0.8% మేర పెరిగితే వంటగ్యాస్‌ 169%, పెట్రోలు 57%, డీజిల్‌ 78%, పాలు 51%, గోధుమపిండి ధర 56% చొప్పున పెరిగిపోయాయని ట్వీట్‌లో వివరించారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీ ఆదాయం 1,225% మేర పెరిగిందన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు