పార్టీల పరస్పర సహకారంపై మమత చర్చించాలి: చిదంబరం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో విపక్షాలు దానికి మద్దతు ఇవ్వాలనీ, బదులుగా.. మిగిలిన చోట్ల ప్రాంతీయ పార్టీలకు హస్తం అండగా నిలవాలని ప్రతిపాదించిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ అంశంపై చర్చ జరపాలని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.

Published : 30 May 2023 05:11 IST

కోల్‌కతా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో విపక్షాలు దానికి మద్దతు ఇవ్వాలనీ, బదులుగా.. మిగిలిన చోట్ల ప్రాంతీయ పార్టీలకు హస్తం అండగా నిలవాలని ప్రతిపాదించిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ అంశంపై చర్చ జరపాలని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు. చర్చలు జరిపినట్లయితే ఒక అవగాహనకు రావడం వీలవుతుందని, అందుకే ఆమె ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నానని ఆయన సోమవారం పీటీఐ వార్తాసంస్థకు చెప్పారు. ‘‘భాజపాయేతర పార్టీల్లో బలమైనది ఆయా రాష్ట్రాల్లో కూటమికి నేతృత్వం వహించాలి. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ కోవలోకి వస్తుంది. భాజపాయేతర పార్టీల మధ్య ఐక్యతకు ఇప్పటికే కొంత ముందడుగు పడింది. దూరం ఇంకాస్త తగ్గాల్సి ఉంది. రాబోయే కొద్దినెలల్లో ఇది వేగం పుంజుకుంటుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన విజయం 2024 సార్వత్రిక ఎన్నికలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. కార్యకర్తల్లోనూ ఉత్సాహం ఇనుమడించింది. ఇది శుభసంకేతం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాన్ని పునరావృతం చేసేందుకు మేం అన్ని ప్రయత్నాలు కొనసాగించాలి’’ అని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు