ప్రజలను తప్పుదోవ పట్టించేలా హరీశ్‌ వ్యాఖ్యలు : జి.నిరంజన్‌

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించకుండా అమరవీరులను అవమానపరుస్తోందంటూ మంత్రి హరీశ్‌రావు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ విమర్శించారు.

Published : 30 May 2023 05:11 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించకుండా అమరవీరులను అవమానపరుస్తోందంటూ మంత్రి హరీశ్‌రావు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మే 26నే కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణను ప్రకటించిందని.. హరీశ్‌రావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్‌ ప్రజలను ఏవిధంగా మోసం చేశారో 20 రోజుల కార్యక్రమంలో తెలియజేస్తామన్నారు.

31న పీసీసీ మైనార్టీ కార్యవర్గ సమావేశం

పీసీసీ మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈనెల 31న గాంధీభవన్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ సోహైల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ మైనార్టీ విభాగం ఛైర్మన్‌, ఎంపీ ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి ముఖ్య అతిథిగా హాజరవుతారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు