తెదేపా ఎన్నికల ప్రణాళికకు విలువ లేదు: మంత్రి నాగార్జున
ఎన్నికల ప్రణాళికలు ఏనాడూ అమలు చేయలేదని, ఇప్పుడు మహానాడులో చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల ప్రణాళికకు విలువ లేదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు.
ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రణాళికలు ఏనాడూ అమలు చేయలేదని, ఇప్పుడు మహానాడులో చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల ప్రణాళికకు విలువ లేదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ వెల్లడించిన ఎన్నికల ప్రణాళికను కాపీ చేసి ప్రకటించిన తెదేపా మేనిఫెస్టోని ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మా ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో 98.2% అమలు చేశాం. నగదు, నగదుయేతర బదిలీ కింద రూ.2.82 లక్షల కోట్లు ప్రజలకు అందించాం. ప్రజలకు సెంటు స్థలం ఇస్తే సహించలేని చంద్రబాబు రాష్ట్రంలోని పేదలను ధనికులుగా మారుస్తామంటే ఎవరు నమ్ముతారు? అన్ని వసతులూ కల్పించి ప్రజలకు టిడ్కో ఇళ్లు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం...’ అని మంత్రి నాగార్జున వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి