చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే: మంత్రి ధర్మాన ప్రసాదరావు

రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో తెదేపా అధినేత చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.

Published : 30 May 2023 05:34 IST

జలుమూరు(శ్రీకాకుళం): రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో తెదేపా అధినేత చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం  తిమిడాం గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి మాట్లాడారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు, ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అంత మందికి నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పిన ఆయన మాటలను నమ్మి ఓటు వేస్తే మోసపోతారని చెప్పారు. మహిళలకు అనేక పథకాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందిస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని