వివేకా కేసు గురించే సీఎం దిల్లీ పర్యటన

సీఎం జగన్‌ కేంద్రంలోని పెద్దలతో ఏం చర్చించారో ప్రజలకు వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Published : 30 May 2023 05:34 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: సీఎం జగన్‌ కేంద్రంలోని పెద్దలతో ఏం చర్చించారో ప్రజలకు వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. వివేకా హత్య కేసు గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో చర్చించడానికే జగన్‌ దిల్లీ వెళ్లారనే సమాచారం తమకు ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలోని పెద్దలను కలిసి ఉంటే.. ఏం చర్చించారు? అమిత్‌షా ఏయే అంశాలపై సానుకూలంగా స్పందించారు, ఏం హామీలు ఇచ్చారు? ప్రజలకు తెలపాలని పేర్కొన్నారు. జగన్‌ అవినీతి సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతోందని ఆరోపిస్తూ... అయినా ఆయనపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదోనని అనుమానం వ్యక్తం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని