ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేశారు.

Published : 30 May 2023 05:34 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

మచిలీపట్నం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం అమలులో చోటుచేసుకుంటున్న నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ ధర్నాచౌక్‌లో ధర్నా చేశారు. కార్యక్రమానికి హాజరైన రాఘవులు మాట్లాడుతూ.. కార్మిక వర్గాల పోరాట ఫలితంగా హక్కుగా సాధించుకున్న ఉపాధిహామీ కార్యక్రమంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు.  

చట్ట ప్రకారం 100 రోజుల పని కల్పించాలంటే రూ.2.70 లక్షల కోట్లు అవసరమన్నారు. ప్రతి ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధిస్తున్నారని, గత ఏడాదితో పోలిస్తే రూ.30,000 కోట్లు తగ్గించారని తెలిపారు. కార్పొరేట్‌ వర్గాలకు అప్పులు రద్దు చేస్తున్న కేంద్రం పేదలకు పనిరద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. ఆర్‌.రఘు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, పౌరసంఘం నాయకులు వై.వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ధర్నా వద్దకు వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు