కొఠియా గ్రామాలపై ఒడిశా కన్ను

కొఠియా గ్రామాలను కలిపేసుకొనేందుకు ఒడిశాలోని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు.

Published : 30 May 2023 05:34 IST

లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కొఠియా గ్రామాలను కలిపేసుకొనేందుకు ఒడిశాలోని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కొఠియా గ్రామాలైన నేరేళ్లవలస, దొర్లతాడ్డివలస, కుంబిమడ, పనుకులోవ, ధూళిభద్ర, ఎగువశెంబిల్లో పార్టీ నాయకులతో కలసి సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా పన్నాగాన్ని ముందస్తుగా పసిగట్టకపోతే మన రాష్ట్రం నష్టపోతుందన్నారు. ఇక్కడున్న విలువైన ఖనిజ సంపదను తరలించుకుపోయేందుకు ఒడిశా మంత్రులు, అధికారులు, అన్ని పార్టీల నాయకులు ప్రణాళికాయుతంగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొఠియాకు ఒడిశా డివిజన్‌ పోస్టల్‌ కోడ్‌ను కేటాయించుకున్నారని ఆరోపించారు. ఈ పర్యటనలో పార్టీ నాయకులు సూర్య, చంద్రశేఖర్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని