జగన్‌ రాజీనామా చేసి విచారణకు సిద్ధపడాలి

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ న్యాయస్థానానికి సమర్పించిన నివేదికే జగన్‌ ప్రమేయం ఉందనడానికి ఉదాహరణ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.

Published : 30 May 2023 05:34 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ న్యాయస్థానానికి సమర్పించిన నివేదికే జగన్‌ ప్రమేయం ఉందనడానికి ఉదాహరణ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తిరుపతిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి జగన్‌.. ప్రధాని మోదీ వద్ద మోకరిల్లుతున్నారు. సీబీఐ, న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం కోసమే దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్‌ వెంటనే రాజీనామా చేసి సీబీఐ విచారణకు సిద్ధపడాలి...’ అని డిమాండ్‌ చేశారు. భాజపా వ్యతిరేక శక్తులను ఏకం చేసి మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి జులైలో జరిగే జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తాం’ అని నారాయణ తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు