రోడ్లపై అడ్డంగా వైకాపా ఎమ్మెల్యేల సభలు.. దుకాణాలు మూయించేసి జులుం
అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రధాన రహదారులపై సభలు పెట్టడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
రాకపోకలు నిలిచిపోయి జనం అవస్థలు
తాడిపత్రి, కురుమద్దాలి(పామర్రు గ్రామీణం), న్యూస్‌టుడే: అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రధాన రహదారులపై సభలు పెట్టడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కడప ప్రధాన రహదారిపై సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. బస్టాండు కూడలి, కడపరోడ్డు వైపు రాకపోకలు నిలిపివేశారు. కడప వైపు నుంచి నంద్యాల, గుత్తి వైపు వెళ్లే యల్లనూరు బైపాస్ మీదగా మళ్లించడంతో ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు దాదాపు 12 కిలోమీటర్ల మేర తిరిగి వెళ్లాల్సి వచ్చింది. సభ నిర్వహణ కోసం సమీపంలో ఉన్న హోటళ్లు, ఇతర దుకాణాలు అన్నీ మూసివేయాలని పోలీసులు ఆంక్షలు విధించడంతో వాటి నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉష శ్రీచరణ్ ఈ సభలో పాల్గొన్నారు.
* కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి కూడలిలో విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ బహిరంగ సభ నిర్వహించారు.పేదల ఇళ్ల స్థలాలపై తెదేపా అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ వైకాపా ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ, నిసన కార్యక్రమం చేపట్టారు. ప్రచార రథం రోడ్డు మధ్యలో నిలిపి దాదాపు అర్ధగంటపాటు ఎమ్మెల్యే ఉపన్యాసం ఇచ్చారు. దీంతో రహదారికి రెండు వైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలువురు ప్రయాణికులు అసహనానికి గురై..అధిష్ఠానం మెప్పుకోసం ఇలా జాతీయ రహదారిని అడ్డగించడం సమంజసం కాదంటూ ప్రచార రథం వైపు దూసుకెళ్లారు. మరికొందరు ఘర్షణకు దిగారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాను వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఎమ్మెల్యే తన ప్రసంగం పూర్తికాకుండానే ముగించి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి