ఆరు ప్యాలెస్‌లున్న జగన్‌ పెత్తందారు కాదా?

ఆరు ప్యాలెస్‌లు, భారతీ సిమెంట్స్‌, సండూర్‌ పవర్స్‌ లాంటి 16 భారీ కంపెనీలు ఉన్న సీఎం జగన్‌ పేదవాడు ఎలా అవుతారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

Published : 30 May 2023 05:48 IST

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆరు ప్యాలెస్‌లు, భారతీ సిమెంట్స్‌, సండూర్‌ పవర్స్‌ లాంటి 16 భారీ కంపెనీలు ఉన్న సీఎం జగన్‌ పేదవాడు ఎలా అవుతారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. 2004లో రూ.1.73 కోట్ల ఆస్తితో.. ఉన్న ఇల్ల్లు కూడా అమ్ముకోవడానికి సిద్ధమైన వ్యక్తి అతి తక్కువ సమయంలో రూ.లక్షల కోట్లు సంపాదించడం పెత్తందారీతనం కాదా? అని సోమవారం ఓ ప్రకటనలో నిలదీశారు. ‘‘సొంత బాబాయ్‌పై గొడ్డలివేటు వేయించడం, హంతకుల్ని కాపాడటం, తండ్రి ఆస్తిలో న్యాయమైన వాటా అడిగిన చెల్లిని, తల్లిని తరిమేయడం, ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌ చేయించి.. దాన్ని వీడియో తీయించి ఆనందించడం, ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు ధ్వంసం చేయడం, ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రుల ఫొటోలు తీసేసి తన ఒక్కడి ఫొటో మాత్రమే వేసుకోవడం ఇవన్నీ పెత్తందారీతనం కాదా? రాష్ట్రంలోని అన్ని పార్టీలు, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించినా... జగన్‌ దాన్ని నిర్వీర్యం చేశారు. తీర్మానాలు లేకుండా స్థానిక సంస్థల నిధులు రూ.12 వేల కోట్లు దారి మళ్లించారు. తన దోపిడీ లక్షణాల్ని ఎదుటి వారికి అంటగట్టడం జగన్‌రెడ్డి నైజం. ఆయనపై 40 క్రిమినల్‌ కేసులుంటే అందులో 24...420 కేసులే.  జగన్‌రెడ్డిని మించిన పెత్తందారు...దోపిడీదారు దేశంలోనే లేరు. దోచుకో, పంచుకో, తినుకో పేటెంట్‌ జగన్‌రెడ్డిదే...’’ అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు