భారాసలోకి మధ్యప్రదేశ్‌ ముఖ్య నేతలు

దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం భారాస కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి.

Published : 31 May 2023 02:57 IST

ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం భారాస కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, మేధావులు భారాసలో చేరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ముఖ్యనేతలు మంగళవారం గులాబీ కండువా కప్పుకొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో భాజపాకు చెందిన మాజీ ఎంపీ బుద్ధసేన్‌ పటేల్‌, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే డా.నరేశ్‌సింగ్‌ గుర్జార్‌, ఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధీరేంద్రసింగ్‌, సాత్నా జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలు విమల బాగ్రి, సర్వజన్‌ కల్యాణ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్‌యాదవ్‌, భోపాల్‌కు చెందిన రాకేశ్‌ మాల్వీయ, సత్యేంద్రసింగ్‌ తదితరులు భారాసలో చేరారు. తెలంగాణ మోడల్‌ అభివృద్ధి కోసం మధ్యప్రదేశ్‌ ప్రజలు ఎదురుచూస్తున్నారని, భారాస సభ్యత్వం తీసుకోవడానికి అక్కడి ప్రజలు పెద్దఎత్తున సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. భోపాల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, తప్పనిసరిగా రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుద్ధసేన్‌ పటేల్‌ను మధ్యప్రదేశ్‌ రాష్ట్ర భారాస కోఆర్డినేటర్‌గా సీఎం నియమించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల్కసుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని