అభివృద్ధిపై చర్చకు రావాలి

రాష్ట్రంలో  తొమ్మిదేళ్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైకాపా, తెదేపాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్‌ విసిరారు.

Published : 31 May 2023 04:38 IST

భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో  తొమ్మిదేళ్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైకాపా, తెదేపాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని విజయవాడలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ‘కేంద్ర నిధులతో జరుగుతున్న పనులకు పేర్లు మార్చుకోవడం వైకాపాకు అలవాటుగా మారింది. కేంద్రం ప్రకటించిన ప్రాజెక్టులకు ప్రభుత్వం స్థలాలు కేటాయించడం లేదు. రాష్ట్రం మీదుగా మూడు పారిశ్రామిక కారిడార్లు వెళుతున్నాయి. వీటిపై ఎన్నడూ సీఎం జగన్‌ సమీక్షించలేదు...’ అని సోమువీర్రాజు చెప్పారు. భూముల మార్కెట్‌ విలువల పెంపుతో రూ.పది వేల కోట్లకుపైగా అదనపు ఆదాయాన్ని సంపాదించాలనుకోవడం ప్రజల్ని దోపిడీ చేయడం కాదా? అని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని