వైకాపా పాలనంతా తిట్టుకోవడం.. తన్నుకోవడమే: టి.జి.వెంకటేశ్‌

వైకాపా నాలుగేళ్ల పాలనలో తిట్టుకోవడం, తన్నుకోవడం తప్ప అభివృద్ధి గురించి మరిచిపోయారని మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌ విమర్శించారు.

Published : 31 May 2023 04:38 IST

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: వైకాపా నాలుగేళ్ల పాలనలో తిట్టుకోవడం, తన్నుకోవడం తప్ప అభివృద్ధి గురించి మరిచిపోయారని మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌ విమర్శించారు. కర్నూలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. రాజధాని కోసం కొట్టుకుంటుంటే... ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోతున్నాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భాష చూస్తే తెదేపాతో కలిసి ఉన్నట్లు అర్థమవుతోంది. జనసేనతో కలిసి ఉండాలా లేదా అన్నది భాజపా అధిష్ఠానానిదే తుది నిర్ణయం...’ అని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వినూషారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై జూన్‌ 30వ తేదీ వరకు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు