అయిదో ఏట అడుగుపెట్టిన జగన్ విధ్వంస పాలన: చంద్రబాబు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదట చెప్పిన విధ్వంస విధానాన్నే ఆయన, ఆయన ప్రభుత్వం నిత్యం పాటిస్తోందని తెదేపా అధ్యక్షులు చంద్రబాబు పేర్కొన్నారు.
ఈనాడు,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదట చెప్పిన విధ్వంస విధానాన్నే ఆయన, ఆయన ప్రభుత్వం నిత్యం పాటిస్తోందని తెదేపా అధ్యక్షులు చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశాలిస్తూ.. ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించారు. ‘మొదటిరోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం.. నాలుగేళ్లు పూర్తి చేసుకుని అయిదో ఏట అడుగు పెట్టింది..’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ ఇచ్చిన తొలి ఆదేశాలు.. ప్రజా వేదిక కూల్చివేత దృశ్యాలు ఉన్న వీడియోను తన ట్వీట్‌కు చంద్రబాబు జత చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ