మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం..

‘మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువగా ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

Published : 31 May 2023 04:38 IST

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: ‘మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువగా ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం గృహ నిర్మాణ ప్రగతిపై జరిగిన సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను ఏ సమావేశానికి పిలిచినా అక్కడ ఎక్కువగా అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండటంతో తనకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న సమావేశంలో కూడా తనకు ఇరువైపులా రెడ్లే ఎక్కువగా ఉన్నారన్నారు. తన నియోజకవర్గ పరిధిలో పేదలకు కొండలు, గుంటలు, మిట్టలు ఉన్న చోట ఇళ్ల స్థలాలు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై గట్టిగా మాట్లాడే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి నియోజకవర్గంలో అన్ని రకాలుగా అనువైన చదును భూములు జగనన్న కాలనీలకు ఇచ్చారని తెలిపారు. బాలకృష్ణాపురంలో జలకళ పథకం కింద చంద్రబాబు వర్గీయులకు 25 బోర్లు మంజూరు చేశారన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నా.. మనకు మాత్రం ఓటు వేయరని తెలిపారు. నియోజకవర్గంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని దళితులు ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఏ కులానికి ఎన్ని ఇళ్లు కేటాయించారో అధికారుల వద్ద లెక్కలు లేకపోవడం శోచనీయమని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు